వ్యాధినిరోధక శక్తిని వర్షాకాలంలో ఇలా పెంచుకోండి..
వర్షాకాలంలో సాధారణంగా ఇన్ఫెక్షన్ల దాడి ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి తప్పించుకోవాలంటే వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మనం తినే ఆహారాన్ని బట్టే శరీరంలో బలం ఉంటుంది. అందుకోసం వర్షాకాలంలో బలమైన పోషకాలున్న ఆహారం తినవలసి ఉంటుంది. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్-సి ఎక్కువగా ఉండే పండ్లను తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలు, బెర్రీలు, జామకాయలు, ఆరెంజ్ ఎక్కువగా తీసుకోవాలి. గుడ్లు, శెనగలు, పెసలు, తృణధాన్యాలు, చిక్కుడు, బీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉంటే హై ప్రోటీన్లు శరీరానికి రక్షణ ఇస్తాయి.

రోజుకు కనీసం 10 నిముషాల పాటు ప్రాణాయామం, ఇరగంట సేపు వ్యాయామం చేయాలి. దీనితో శరీర మెటబాలిజం కుదుట పడి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలి. కొబ్బరినీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలు కూడా చాలా మంచివి. రాత్రి నిద్రకు రెండు గంటల ముందుగా రాత్రి భోజనాన్ని ముగించాలి. కనీసం 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలకు, సిగరెట్లకు దూరంగా ఉండాలి. వీటి వల్ల వ్యాధినిరోధక శక్తి క్షీణిస్తుంది. దీర్ఘకాల రోగాలు దాడి చేస్తాయి.