దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చడం అంటే మత మార్పిడిని ప్రోత్సహించడమే
దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చే బిల్లును అడ్డుకోవాలన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. వారికి రిజర్వేషన్ కల్పించడం అంటే మత మార్పిడులను ప్రోత్సహించడమేనన్నారు. ఈ విషయంపై అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా వ్యతిరేకిస్తామన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్దమని, దీనికి అంగీకారం తెలుపరాదని, ఈ బిల్లును వ్యతిరేకించాలని పేర్కొన్నారు సోము వీర్రాజు.

