Home Page SliderTelangana

జూన్15న సిద్దిపేటలో ఐటీ హబ్ ప్రారంభం

తెలంగాణా మంత్రి హరీశ్‌రావు ఇవాళ సిద్ధిపేటలో పర్యటించారు. కాగా ఆయన సిద్ధిపేటలో ఐటీ హబ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జూన్ 15వ ఐటీ హబ్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేటలో ఐటీ హబ్ ప్రారంభంతో ప్రత్యక్షంగా 750 మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. దీని ద్వారా మరికొంతమంది పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని ఆయన తెలిపారు. కాగా ఈ ఐటీ హబ్‌లో టాస్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇస్తారని మంత్రి హరీశ్‌రావు వివరించారు. దీంతో సిద్దిపేట వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.