NewsTelangana

ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా

హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మంత్రి కేటీఆర్‌ ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాల్సి ఉండగా ఆ కార్యక్రమాన్ని ఈ నెల 27కి వాయిదా వేశారు. పాత బస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే కేటీఆర్‌ ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు రూ. 45.79 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ విస్తరణ పనులు చేపట్టారు. ఈ ఫ్లైఓవర్‌ వల్ల చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్‌ కష్టాలు దూరం కానున్నాయి. ఫ్లైఓవర్‌ రెండు వైపులా నిర్మాణం చేపట్టడంతో ప్రయాణం సులభం కావడంతోపాటు ప్రయాణ సమయం కూడా తగ్గనుంది.