Home Page SliderNational

మూడవవారంలో కూడా ‘దేవర’ రికార్డుల మోత

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ నటించిన దేవర చిత్రం రిలీజై 18 రోజులు పూర్తవుతోంది. అయినా జోరు తగ్గలేదు. ఏపీ, తెలంగాణలలో ప్రతి రోజూ కోటి రూపాయలు సాధించి ట్రెండింగ్‌లో ఉంది. రాజమౌళి తర్వాత ఈ స్థాయి కలెక్షన్ల రికార్డు సాధించిన ఘనత కొరటాల శివ దక్కించుకున్నారు. సీడెడ్ ఏరియాలో రూ.30 కోట్ల పైన ఎన్టీఆర్ రెండు చిత్రాలు కలెక్షన్లు సాధించాయి. ఇప్పటి వరకూ రూ.520 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది దేవర. మొదటి భాగం కంటే రెండవ భాగం ఇంకా పవర్ ఫుల్‌గా ఉంటుందని ఇప్పుడు చూసింది పదిశాతమే అంటూ దర్శకుడు చెప్పడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.