తెలంగాణా ప్రజల కళ్లల్లో కేసీఆర్ మట్టికొట్టారు: ఈటల
ప్రధాని మోదీ ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మోదీ వరంగల్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ..వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని శ్రీకారం చుట్టడం ఉత్తర తెలంగాణా జిల్లాలకు శుభసూచికమని అన్నారు. తెలంగాణాకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకే ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చారని ఈటల తెలిపారు. తెలంగాణాలో సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని ప్రజలంతా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ప్రజలకు హామీలు ఇచ్చి ప్రజల కళ్లల్లో మట్టికొట్టిన కేసీఆర్‌ను ఓడించాలని ఈటల పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణాను చేతల్లో చూపించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.