Home Page SliderTelangana

ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీజేపీ వస్తేనే మంచిది

నీళ్లు, నిధులు, నియామకాల్లో ఏ ఒక్క లక్ష్యం కోసమూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణాత్మకంగా పనిచేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా కేసీఆర్‌పై వ్యతిరేకత కనబడుతోంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్ కుటుంబంపై నివురుగప్పిన నిప్పులా వ్యతిరేకత ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుత మంత్రులందరూ ఇంటిదారి పట్టవలసిందే. గజ్వేల్‌లో ఈటల రాజేందర్ చేతిలో కేసీఆర్, సిరిసిల్లలో రాణీరుద్రమ చేతిలో కేటీఆర్‌ల ఓటమి ఖాయం. కామారెడ్డిలోనూ బీజేపీ అభ్యర్థే గెలుస్తారు. పథకాల పేరిట డబ్బులు పంచడమే మంచి పరిపాలన అనుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో.. అక్కడ ఏపీలో అదే జరుగుతోంది. మంచి పరిపాలన అంటే ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా అందేలా చేయడమే నన్న విషయం గ్రహించడం లేదు..