కేంద్రబడ్జెట్‌లో బీహార్‌కు కూడా వరాలజల్లు
కేంద్రబడ్జెట్ 2024లో ఎన్డీయే మిత్రపక్షం జేడీయూ పాలిత రాష్ట్రం బీహార్‌కు కూడా వరాల జల్లు కురిపించారు. బీహార్‌లోని వివిధ రహదారి ప్రాజెక్టులకు రూ.26వేల కోట్లు కేటాయించింది కేంద్రప్రభుత్వం. వీటితో పాటు విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. వరద నివారణ, సాగు కొరకు రూ.11 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులను మల్టీ లేటరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీల ద్వారా సమకూర్చనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.