బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట
హైదరాబాద్: పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో వీటికి ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వచ్చే అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.