NewsTelangana

9వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌దే ఆధిక్యత

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ప్రతి రౌండ్‌లోనూ స్వల్ప ఆధిక్యతను కొనసాగిస్తోంది. 9వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యత సాధించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి 7497 ఓట్లు, బీజేపీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 6665 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 832 ఓట్ల ఆధిక్యత సాధించింది. 9 రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 3923 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇప్పటివరకు కూసుకుంట్లకు 59,840 ఓట్లు, రాజగోపాల్‌ రెడ్డికి 55,908 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 14,596 ఓట్లు పడ్డాయి.