Home Page SliderTelangana

తెలంగాణాలో బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారు

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్నాయి.ఈ మేరకు అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అయితే తాజాగా బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ప్రతిపక్ష పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణాలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ దొంగలను,రౌడీలను బరిలోకి దింపుతుందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా దరఖాస్తులను అమ్ముకుంటున్నారని మంత్రి గంగుల విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలకు భయం పట్టుకుందన్నారు. కాగా రాష్ట్రంలో ఒకేసారి 50మంది అభ్యర్థులను ప్రకటించే దమ్ము బండి సంజయ్,రేవంత్ రెడ్డికి ఉందా అని బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.