తమిళనాడులో కల్తీ సారా కలకలం.. నలుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలో కల్తీ సారా కలకలం సృష్టిస్తోంది.కాగా కల్లకురిచిలో కల్తీ సారా తాగి నలుగురు మృతి చెందారు. అయితే మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కల్తీ సారా విక్రయాలపై గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కాగా ఈ ఘటన పూర్తి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.