Home Page SliderTelangana

ఆర్టీసీ బస్సుల్లో స్త్రీల సీట్లు-పురుషుల సీట్లు అని రాస్తే మంచిది

TSRTC బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు (రిజర్వుడు) స్త్రీలకైతే స్త్రీలు అని రాసి పెడతారు. అదే పురుషులకు కుడా పురుషులు అని రాసి వారికి కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో బస్సులు ఖాళీ సీట్లు లేకుండా స్త్రీలతోనే నిండుతున్నాయని, పురుషులకు బస్సుల్లో సీట్లు లేకుండా పోయాయని, సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 25 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు.