ఝార్ఖండ్‌లో బీజేపీకి చుక్కెదురు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి చుక్కెదురయ్యింది. ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి. జేఎంఎం కూటమి 53 ప్రాంతాలలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, బీజేపీ కూటమి 26 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇతరులు 2 ప్రాంతాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బర్హైత్ స్థానంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆధిక్యతలో ఉన్నారు. ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా గండేలో ఆధిక్యత కనపరుస్తున్నారు. వారి బంధువు సీతా సోరెన్ బీజేపీ నుండి జంతారాలో ఆధిక్యతలో కొనసాగడం విశేషం. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది జేఎంఎం కూటమి.
BREAKING NEWS: మహారాష్ట్రలో మహాయతి జోరు..