హైదరాబాద్ లో అక్కడ రియల్ ఫైటింగ్, రేసులో నలుగురు
హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురాలో రియల్ ఫైటింగ్ జరుగుతోంది. అక్కడ విజయం కోసం నాలుగు పోర్టీలు హోరాహోరీ తలపడుతుంటే… బీజేపీ అక్కడ దూసుకెళ్తోంది. బీజేపీ అభ్యర్థి నరేందర్ బాబు యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతుంటే మజ్లిస్ అభ్యర్థి కేవలం 625 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక మజ్లిస్ బాచావో తెరీక్ అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్ 1120 ఓట్ల వెనుకంజలో ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థి సామా సురేందర్ రెడ్డి 2876 ఓట్ల వెనుకబడి ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రవిరాజుకు కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ కేవలం 39.64 శాతం మాత్రమే ఓటింగ్ పోలయ్యింది. రాష్ట్రంలోనే అత్యల్ప ఓటింగ్ నమోదైన నియోజవకర్గాల్లో ఇదొకటి.



 
							 
							