ఆగస్టులో రుణమాఫీ రూ.2 లక్షలు ఉంటుంది
టిజి: ఆగస్టు నుండి రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత రూ.50 వేలు, ఆ తర్వాత రూ.లక్ష, ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణం చెల్లించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70 శాతం మందికి పైగా రూ.లక్ష లోపే రుణం ఉన్నట్లు అంచనా వేస్తోంది. అటు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించనుంది.

