అసోంలో ఘోరం… భర్త, అత్తను చంపి ఫ్రిడ్జ్‌లో దాచి…!
అస్సాం మహిళ దురాఘతం
భర్త, అత్తను చంపి, ముక్కులుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన మహిళ
మేఘాలయ చిరపుంజిలో శరీరభాగాలు
అసోం గౌహతిలోని నూన్‌మతిలో ఒక మహిళ భర్త, అత్తని చంపి, వారి మృతదేహాలను నరికి ఫ్రిజ్‌లో దాచింది. వందన కలిత అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని ఈ దురాఘతానికి పాల్పడింది. భర్త అమరజ్యోతి డే, అత్త శంకరి డేను చంపిన మూడు రోజుల తర్వాత విషయం బయటకు వచ్చింది. వందన కలిత, ఆమె ప్రేమికుడు శరీర భాగాలను గౌహతి నుండి 150 కిలోమీటర్ల దూరంలో పొరుగున ఉన్న మేఘాలయలోని చిరపుంజికి తీసుకెళ్లి… అక్కడే శరీర భాగాలను పడేశారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ముక్కలుగా నరికి.. శరీర భాగాలను ఫ్రిజ్‌లో వందన భద్రపరిచిందని పోలీసులు తెలిపారు. గతేడాది ఢిల్లీలో శ్రద్ధా వాకర్… ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా చేత హత్యకు గురైన సంఘటన తరహాలోనే ఈ ఘటన ఉంది. అక్కడ ప్రియురాలిని అఫ్తాబ్ చంపితే.. ఇక్కడ భర్తను, భార్య చంపి అదే తరహాలో శరీరభాగాలను ఫ్రిడ్జ్‌లో పెట్టి భద్రపరిచింది.

