Andhra PradeshHome Page Slider

ఏపీలో రూ. 8000 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు

విజయనగరంలోని గాజులరేగ వద్ద నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులను ఎపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధరరెడ్డి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, ఇతర అధికారులతో కలిసి ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల తరగతి గదులు, హాస్టల్‌ భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ తొలివిడతగా నిర్మిస్తున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలనేది ప్రభుత్వం నినాదమని, అందుకు దశలవారీగా రూ. 8000 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయించనున్నట్లు తెలిపారు.

వీటిలో నాలుగు కళాశాలలకు ఇప్పటికే అనుమతి లభించిందని, రాజమండ్రి వైద్య కళాశాలకు కూడా కొద్ది రోజుల్లో అనుమతులు రానున్నాయని తెలిపారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆదేశాలకు అనుగుణంగా జులై 15 నాటికే ఈ కళాశాల తరగతి గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి, ఆగస్టు నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా కొత్తగా 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పాడేరు, పులివెందుల, ఆదోని వైద్య కళాశాలలు 2024-25 విద్యాసంవత్సరంలో, మరో తొమ్మిది వైద్య ప్రభుత్వ వైద్య కళాశాలలు 2025-26లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. తనిఖీలో ఎపిఎంఎస్‌ఐడిసి ఎమ్‌డి మురళీధరరెడ్డి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, డీఎంఇ వరప్రసాద్‌, ఎపీఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఇ అంకమ్మ చౌదరి, ఇఇ బీఎన్‌ ప్రసాద్‌, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పద్మలీల తదితరులు పాల్గొన్నారు.