ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలే ధనిక పార్టీలు
తెలంగాణాలోని బీఆర్‌ఎస్ పార్టీ రెండవ స్థానంలో, ఏపీలోని వైసీపీ నాలుగవ స్థానంలో భారత్‌లోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీలుగా నిలిచాయి. ఆయా పార్టీలు సేకరించిన విరాళాల ఆధారంగా ఈ లెక్కలను ఏడీఆర్ విశ్లేషించింది. 2016 నుండి 2022 వరకూ వచ్చిన విరాళాలలను బట్టి ఈ ర్యాంకులు కేటాయించారు. అన్నింటి కన్నా ఎక్కువగా 692 కోట్లతో బీజేడీ మొదటి స్థానంలో ఉండగా, బీఆర్‌ఎస్ 476 కోట్లతో రెండవస్థానంలో ఉంది. తమిళనాడులోని డీఎంకే పార్టీ 475 కోట్లతో మూడవస్థానం, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ 456 కోట్లతో నాల్గవ స్థానంలోనూ ఉన్నాయి. తర్వాతి స్థానాలలో శివసేన, ఆప్, టీడీపీ, జేడీయూ నిలిచాయి.

