ఇమ్రాన్ ఖాన్ సర్జరీ విజయవంతం
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లోని షౌకత్ ఖానమ్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. బుల్లెట్ గాయమైన ఇమ్రాన్ ఖాన్ కాలికి సర్జరీ చేసినట్టు పీటీఐ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. పాక్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఇమ్రాన్‌పై ప్రత్యర్థులు పక్కా ప్లాన్‌తోనే హత్యకు కుట్ర చేశారని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

పంజాబ్ ప్రావిన్స్‌లో ఇమ్రాన్ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయమైంది. పాకిస్తాన్ వజీరాబాద్‌లో కంటైనర్ ట్రక్కుపై ఇమ్రాన్ నిలబడి ప్రజలకు అభివాదం చేస్తుండగా దుండగులు పీటీఐ నేతలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు నలుగురు అనుచరులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ సేఫ్‌గా ఉన్నారు.

