Home Page SliderNational

ఆకట్టుకుంటున్న కొడైకెనాల్ జలపాతం

తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అక్కడి జలపాతాలు పొంగి పొరలుతున్నాయి. ఇటీవల సంభవించిన తుఫాన్ ధాటికి కొడైకెనాల్‌లోని జలపాతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కొండలపై నుంచి తెల్లని నురుగుతో దూకుతూ సందర్శకులను కట్టి పడేస్తున్నాయి. దీనితో ఈ ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. పచ్చని కొడైకెనాల్ కొండల్లో తెల్లగా దూకుతున్న జలపాతాలను కెమెరాలతో క్లిక్ మనిపిస్తున్నారు.