ఆకట్టుకుంటున్న జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్
ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ సంస్థలు ట్రాయ్ ఆదేశాల మేరకు కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చారు. డేటా లేకుండా వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు తీసుకువచ్చాయి. జియో వాయిస్ ఓన్లీ పేరుతో 84 రోజుల వ్యాలిడిటీతో రూ.458కే అందిస్తోంది. దీనితో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. జియో టీవీ, సినిమా, కౌడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఏడాది కాలానికి రూ.1958లతో మరో ప్లాన్‌లో కూడా ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి.
ఎయిర్‌టెల్ కూడా 84 రోజులకు రూ.499తో వాయిస్ కాల్స్, 900 ఎస్సెమ్మెస్‌లతో రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. అలాగే ఏడాది వ్యాలిడిటీతో రూ.1959లకు మరో ప్లాన్ లభిస్తోంది. వీటిపై 3 నెలల అపోలో సర్కిల్ మెంబర్ షిప్, హలో ట్యూన్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ తక్కువ డేటాతో, వాయిస్ కాల్స్ కూడా ప్రవేశపెట్టింది. రూ.548లకు 84 రోజుల వ్యాలిడిటీ, 7 జీబీ డేటా, 900 ఎస్సెమ్సెస్‌లు పొందవచ్చు.