కర్ణాటకలో ఆకట్టుకుంటున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికార,ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో కర్ణాటక రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించింది. కాగా ఉగాది,గణేష్ చతుర్థి,దీపావళి సందర్భంగా వీటిని పంపిణీ చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా పోషణ స్కీమ్ ద్వారా కర్ణాటకలోని నిరుపేదలకు రోజు అరలీటర్ నందిని పాలు ,నెలకు 5 కిలోల చొప్పున బియ్యం అందిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది. దీంతో కర్ణాటక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.