తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనంపై కీలక అప్‌డేట్
ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భాగ్యంగా భావించే తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి పది రోజుల పాటు అవకాశం కల్పించామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 10 ఉదయం 4.30 గంటల నుండి ప్రోటోకాల్ దర్శనం, ఉదయం 8 గంటల నుండి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. దర్శనం టోకెన్లు కలిగినవారికే తిరుమల ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకూ స్వర్ణరథం ఊరేగింపు ఉంటుంది. సామాన్య భక్తుల దర్శనం కోసం సిఫార్సు లేఖలు రద్దు చేశారు. ఈ పది రోజలలోనూ వైకుంఠద్వారాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.