ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వం ఇటీవల కొందరికి కారుణ్య నియమాల కింద ఉద్యోగాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఈ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందినవారు తప్పనిసరిగా సీపీటీ(కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్) పాస్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. కాగా 2023 ఫిబ్రవరి 24 నాటి ఉత్తర్వుల ప్రకారం ఆ టెస్టు ఉత్తీర్ణత సాధించాల్సిందేనని తెలిపింది.ఆ తర్వాతే సర్వీసును రెగ్యులర్ చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెండేళ్ల కాల వ్యవధిలోగా సీపీటీ అర్హత సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.