Home Page SliderTelangana

తెలంగాణా జీవిత బీమా పాలసీదారులకు ముఖ్యగమనిక

తెలంగాణా ప్రభుత్వ జీవిత బీమా(టిజిఎల్ఐ) పాలసీదారులగు ఉద్యోగులు,ఉపాధ్యాయులకు టిజిఎల్‌ఐ సంచాలకులు వి.శ్రీనివాస్ కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు బీమా పాలసీని పొందాలంటే బీమా అర్హత వయస్సు (56) సంవత్సరాల లోపు ఉండాలన్నారు. ఈ మేరకు వారు జీతభత్యముల నుండి నెలసరి బీమా ప్రీమియంలను క్రమం తప్పకుండా తగ్గించి తదనుగుణంగా ప్రతిపాదన పత్రాలు సంబంధిత జిల్లా భీమా కార్యాలయాలకు సమర్పించి పాలసీలు పొందాలన్నారు.కాగా వారు మాత్రమే భీమా ప్రయోజనాలకు అర్హులవుతారని ఆయన స్పష్టం చేశారు. అయితే వీరిలో కొంతమంది భీమా అర్హత వయస్సు(56)లోపు ఉండి ప్రీమియంలు క్రమం తప్పకుండా తగ్గించుకున్నప్పటికీ సంబంధిత కార్యాలయంలో ప్రతిపాదన పత్రాలు సమర్పించకపోవడంతో నేటికీ పాలసీలు పొందలేదన్నారు. కాగా అలాంటి వారు అన్నిరకాల భీమా ప్రయోజనాలకు అనర్హులవుతారన్నారు. కాబట్టి తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు పాలసీకి సంబంధించిన ప్రతిపాదన పత్రాలు బీమా కార్యాలయాల్లో సమర్పించి  వాటికి తగిన విధంగా పాలసీలను పొంది అట్టి పాలసీ నెంబర్లను సమగ్ర ఆర్థిక నిర్వహణ,సమాచార విధానం (ఐఎఫ్ఎంఐఎస్) పోర్టల్ నందలి ఉద్యోగుల జాబితాలో అప్‌డేట్ చేసుకోవాలని ఆయన తెలిపారు. లేని పక్షంలో వారి నెలసరి ప్రీమియం మొత్తాలు అనామకుల ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంటుదన్నారు. తద్వారా వారు అన్ని రకాల బీమా పాలసీలకు అనర్హులవుతారని స్పష్టం చేశారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీమా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.