Andhra PradeshHome Page Slider

సంబంధం లేని కేసులో ఇరికించారు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

శిరోముండనం కేసును భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధిపొందాలని చూసిన ప్రత్యర్థులకు,టీడీపీ నేతలకు ఇవాళ వచ్చిన తీర్పు రుచించదన్నారు ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు. సంబంధం లేని కేసును ఇంతకాలం ఎదుర్కొంటూ వచ్చానన్న ఆయన, కోర్టు తీర్పును హైకోర్టులో అప్పీల్ చేస్తానన్నారు. హైకోర్టులో 100 శాతం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. కేసు కోసమే, పార్టీలు మారుతున్నానని రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు నిరాశ ఎదురైందన్నారు. ప్రభుత్వమే కేసులు మాఫీ చేయగలిగితే చంద్రబాబుపై వున్న కేసులు సంగతేంటన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానన్న త్రిమూర్తులు, రాజకీయాలకు కేసుకు సంబంధం లేదన్నారు. ఇకపై ప్రతిపక్షాలు ఏ విమర్శలు చేస్తాయో చూస్తానన్నారు.