Home Page SliderNational

బంగారం అమ్మకాలపై రెండువేల నోట్ల రద్దు ప్రభావం

రెండువేల నోట్ల రద్దును ప్రభుత్వం ప్రకటించగానే రకరకాలుగా ప్రజలు తమ వద్ద ఉన్న రెండువేలనోట్లను మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బ్యాంకుల్లో మార్చుకుంటే ఐటీ శాఖకు తెలుస్తుందనే ఉద్దేశ్యంతో బంగారం కొనుగోళ్లు మొదలుపెట్టారు చాలామంది. రెండులక్షల రూపాయల వరకూ డబ్బుతో బంగారం కొనే వీలుండడంతో జోరుగా వ్యాపారం కొనసాగుతోంది. దీనితో గత నాలుగు రోజుల్లో 5 శాతం నుండి 10 శాతం మేర ఈ అమ్మకాలు పెరిగాయని బంగారం దుకాణాదారులు పేర్కొన్నారు. ఇంకా సెప్టెంబరు 30 వరకూ సమయం ఉండడంతో ఇంకా రాబోయే రోజుల్లో అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.