Home Page SliderTelangana

తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు

తెలంగాణాకు మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమయినంత వరకూ ఇళ్లలోనే ఉండాలంటూ సూచనలు చేశారు. ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలోని 4 జిల్లాలలు రెడ్ అలర్ట్, 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు.

హైదరాబాద్‌లోని పలు చెరువులకు వరద నీరు భారీగా చేరిపోయింది. దీనితో గేట్లు ఎత్తివేశారు అధికారులు. దీనితో లోతట్టు ప్రాంతాలలో ఈనీరు బాగా చేరిపోయి కాలనీలలో ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. డ్రైనేజ్ నీరు కూడా రోడ్లమీదకు చేరడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. చెరువులోని మురుగునీరు కాలనీలోకి రావడంతో స్థానికులు ఆగ్రహానికి గురవుతున్నారు. సరూర్ నగర్, హస్సేన్ సాగర్‌ల పరిసరాలలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద 513.50 అడుగుల వద్ద ప్రమాదస్థితికి చేరుకుంది. తూముల ద్వారా కిందకి నీరు వదలడంతో ట్యాంక్ బండ్ దగ్గరలోని కాలనీలు భయభ్రాంతులకు గురవుతున్నారు.