బెట్టింగ్ యాప్స్ ఆరోపణలపై ఇమంది రవి స్పష్టీకరణ
బెట్టింగ్ యాప్స్‌తో తనకు సంబంధాలున్నాయన్న ఆరోపణలను ఇమంది రవి తీవ్రంగా ఖండించారు. నాంపల్లి కోర్టులో హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ప్రచారంలో ఉన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
“నా పేరు ఐబొమ్మ రవి కాదు, ఇమంది రవి. పోలీసులు ఏదైనా చెబితే అదే నిజమవుతుందా? నేను ఎక్కడికీ పారిపోలేదు. కూకట్‌పల్లిలోనే ఉన్నాను,” అని ఆయన తెలిపారు.అలాగే, తాను వేరే దేశ పౌరసత్వం మాత్రమే తీసుకున్నానని, అందులో ఎలాంటి అక్రమం లేదని పేర్కొన్నారు. “సరైన సమయంలో అన్ని నిజాలు బయటపెడతాను. ఏ అంశమైనా కోర్టులోనే తేల్చుకుంటాను,” అని ఇమంది రవి స్పష్టం చేశారు.

