Home Page SliderTelangana

బట్టతల ఏమో కాని ఉన్న వెంట్రుకలూ పోయాయ్..

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. హైదరాబాద్ పాతబస్తీలోని ఫతే దర్వాజా తన ఫ్రెండ్ షాపుకు రావాలని చెప్పాడు. వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ.100 తీసుకుని గుండు కొట్టి, కెమికల్స్ రాసి పంపించాడు. గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు కూడా పెట్టి వెళ్లిపోయాడు. కొంత మందికి రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతల ఏమో కాని ఉన్న వెంట్రుకలూ పోయాయని వందలాది మంది యువకులు లబోదిబోమంటున్నారు.