నేను బ్రతికే ఉన్నాను-సానుభూతి ఎందుకు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కి వస్తున్న ఫ్లాప్‌లపై తాజాగా స్పందించాడు. తానేమి చనిపోలేదని. సానుభూతి వద్దని తెలిపాడు. అక్షయ్ కుమార్‌ని ఈ మధ్య పరాజయాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. గత రెండు ఏళ్లలో అక్షయ్ నటించిన 8 సినిమాలు విడుదల కాగా.. అందులో ఏడు సినిమాలు అట్టర్‌ఫ్లాప్.. ఈ మధ్య వచ్చిన సర్ఫిరా అనే చిత్రం కూడా విడుదల అవ్వడమే ఫ్లాప్ టాక్‌తో రిలీజ్ అయ్యింది. దీంతో ప్రస్తుతం అతడి ఆశలన్నీ తాజాగా వస్తున్న ఖేల్ ఖేల్ మే చిత్రంపైనే..
ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తుండగా.. తాప్సీ పన్ను, వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు ముంబైలో జరిగింది. ఇక ఈ వేడుకలో అక్షయ్ కుమార్ పాల్గొనగా.. వరుసగా వస్తున్న ఫ్లాప్‌లపై తాజాగా స్పందించాడు.
ఈ మధ్య వస్తున్న వరుస పరాజయాలపై నాకు సందేశాలు వస్తున్నాయి. నేను వారికి ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను. దీని గురించి ఎక్కువ బాధపడకండి. కొంతమంది మీరు కంబ్యాక్ ఇస్తారు అంటూ సందేశాలు పంపుతున్నారు. ఫ్లాప్ వచ్చిన కూడా ఇక్కడే ఉన్నాను. ఇలాగే నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా.. చివరివరకు ఇక్కడనే ఉంటా ఇప్పటివరకు నేను ఏం సాధించినా అది నా కష్టంతో కూడినదే అంటూ అక్షయ్ కుమార్ వెల్లడి..


 
							 
							