విద్యార్థినులకు అస్వస్థత.. మంత్రి పరామర్శ
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయానికి చెందిన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఎవరూ అధైర్య పడొద్దని, తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.