మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు, చంద్రబాబుపై మరో కేసు నమోదు
•పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన సిఐడి
•కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చిన సిఐడి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదయింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై సిఐడి కేసు నమోదు చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్‌లో కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా మద్యం పాలసీలో అవకతవకలు అనుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమాల చోటు చేసుకున్నట్లు సిఐడి ఆరోపిస్తోంది. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నెల 28వ తేదీన వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో మూడో నిందితునిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రెండో నిందితునిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మొదటి నిందితునిగా నరేష్ లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.


