మీ సిమ్ డీయాక్టివేట్ అయితే అకౌంట్ ఖాళీ అయినట్లే…
సైబర్ నేరాల గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు తేలికగా స్కామర్ల చేతికి చిక్కుతున్నాయట. కేవలం 400 రూపాయలకే పలు అక్రమ వెబ్ సైట్లు కార్డుల నెంబర్లు, పేర్లు, సీవీవీ వివరాలను ప్రైవేట్ స్కామర్లకు అమ్మేస్తున్నారట. పాశ్చాత్యదేశాలలో చెల్లింపులకు వివరాలు ఉంటే చాలు. ఓటీపీ ఉండదట. దీనితో పరిస్థితి భయంకరంగా మారింది. భారత్‌లోని ఓటీపీ విధానం కొంతవరకు కాపాడినా, దీనికి కూడా కొత్త మార్గాలు కనిపెడుతున్నారు కేటుగాళ్లు. మన సిమ్ కార్డును డీయాక్టివేట్ చేసి, వారు ఓటీపీని యాక్సెస్ చేస్తున్నారని పోలీసులు తెలియజేశారు. వారు డూప్లికేట్ సిమ్ కార్డులను సంపాదించి, చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అందుకే మన సిమ్ డీయాక్టివేట్ అయ్యిందని తెలుసుకున్న వెంటనే తొందరపడాలని, తొందరలోనే బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు.

