Andhra PradeshHome Page Slider

మీరు గెలిస్తే ఈవీఎమ్‌లు మంచివి.. మీ పార్టీ ఓడితే చెడ్డవా?: లోకేష్

ఆంధ్రప్రదేశ్: మీరు 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు మంచివి, కానీ 2024 లో ఓడిపోతే అవి చెడ్డవా అని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ నిలదీశారు. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నించే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. ప్రజాధనంతో కొన్న ఫర్నిచర్ ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు. రూ.560 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ ఎందుకు నిర్మించారు? వీటిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం కావాలి అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.