బాబన్నను గెలిపిస్తే మా అందరినీ గెలిపించినట్లే-ఈటల
షాద్‌నగర్‌లో బిజేపి ఎమ్మెల్యే అభ్యర్ధి అందె బాబయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.
హైదరాబాద్ నుండి హెలికాప్టర్‌లో షాద్‌నగర్ చేరుకొని బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈటల కామెంట్స్: ఉద్యమ సమయంలో మహబూబ్‌నగర్ జైల్లో ఉన్నా. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. పెద్దఎత్తున హాజరైన మహిళలకు అభివాదం. ముందుగా మహిళల బాధలు తీరాలి. బాబన్న నాతో పాటు టీఆర్‌ఎస్‌కి రాజీనామా చేసి నాతోపాటు వచ్చినప్పుడు ఆగిపో ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని కెసిఆర్ ఫోన్ చేసి చెప్తే.. మీ ఎమ్మెల్సీ కంటే తమ్ముడు రాజేందర్ తోనే ఉంటా అని చెప్పి వచ్చారు. ఇప్పుడు మీ ఆశీర్వాదం కోసం వచ్చారు. నాయకులు చాలారకాలు ఉంటారు. ప్రజాసేవ చేయడానికి ఆరడగుల ఎత్తు, రంగు, డబ్బులు అవసరంలేదు. మనసు ఉండాలి. ఎన్నికలంటే ఒక తంతులా భావించవద్దు. మన తలరాత మారడానికి ఏకైక ఆయుధం ఓటు. ఆ హక్కు, ఆత్మగౌరవానికి వెలకట్టి కొనాలని చూస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఎంతమందికి ఇచ్చారు? ఇల్లు కట్టకుండా కళ్ళలో మట్టికొట్టారు. రెండవసారి అధికారంలోకి వచ్చాక కెసిఆర్ మారిపోయారు. ప్రజలను కలవకుండా ప్రగతి భవన్ లేదంటే ఫాం హౌస్‌కే పరిమితం అయ్యారు.
కళ్యాణ లక్ష్మి పేరుతో కెసిఆర్ ఇచ్చేది 2500 కోట్లా. పెన్షన్, రైతు బంధు, రైతుభీమా అన్నీ కలిపితే ఇచ్చేది 25 వేల కోట్లు. కానీ లిక్కర్ సీసాలు అమ్మి సంపాదించేది 45 వేల కోట్లు. పిల్లలను 25 ఏళ్లు వచ్చేదాకా చదివిస్తే ఉద్యోగాలు వస్తున్నాయా? 1200 మంది పిల్లల ఆత్మబలిదానాలు చేసింది నౌకర్లకోసమే కాదా? ఒక ముత్యాల శంకర్, ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్నారు. వాటిని కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. కెసిఆర్ హయాంలో మహిళా సంఘాలు నిర్వీర్యం అయ్యాయి. వడ్డీలేని రుణాల కింద 4,200 కోట్ల రూపాయలు బాకీపడ్డారు. బీజేపీ వస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తాం. బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని ప్రకటించారు. కెసిఆర్ మాయమాటలు మోసపోవద్దు. అంతిమ న్యాయ నిర్ణేతలు మీరే.