‘పాక్‌తో చర్చించాలంటే ఆ పని చేయాలి’..రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్‌తో చర్చలు జరగాలంటే ముందు ఉగ్రవాదులను అప్పగించాల్సిందే అంటూ కండిషన్ పెట్టారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగిసిపోలేదని, ఇది కేవలం విరామమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారతీయులపై దాడికి పాల్పడితే పాక్ నామరూపాల్లేకుండా పోతుందని హెచ్చరించారు. ఈసారి భారత్ నౌకాదళం తన పరాక్రమం చూపిస్తుందని, పాక్ తట్టుకోలేదని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత వాయుసేన ప్రభావాన్ని చూసిందని, ఈ సారి నేవీ, ఆర్మీని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఉగ్రవాదుల్ని అప్పగిస్తేనే చర్చలకు ముందుకొస్తామని, ముఖ్యంగా హఫీజ్ సయూద్, మసూద్ అజహర్‌ను అప్పగించాలని పేర్కొన్నారు.