ఇక్కడ ఉద్యోగం కావాలంటే లవ్ బ్రేకప్ అవ్వాల్సిందే…
ఒక కంపెనీ ఉద్యోగస్తులకు విచిత్రమైన కండిషన్ పెట్టింది. ఆ కంపెనీలో ఉద్యోగం కావాలంటే పెద్ద చదువులు, ఉద్యోగానుభవాలు అక్కరలేదు. లవ్ బ్రేకప్ అయి ఉంటే చాలు. అంతే కాక ప్రేమ గురించి బాగా తెలిసి, ప్రేమ భాష, లవర్స్ ఎమోషన్స్ అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఇదే పెద్ద అర్హత. వింతగా అనిపించినా ఇది నిజం. బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉండాలి. కనీసం ఒక్కసారైనా బ్రేకప్ అయి ఉండాలి. మరి అలాంటి వారెవరైనా ప్రయత్నించవచ్చు…

