Home Page SliderTelangana

సీఎంపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం..

కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో పడుకుంటే రాష్ట్రానికి పైసలు ఎట్లా వస్తాయని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సీఎల్ఎల్పీ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఢీల్లి పర్యటనపై కేటీఆర్ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. సీఎంపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఫైర్ అయ్యారు. ‘కేటీఆర్ కు ఉన్న అలవాట్లు అన్నీ ఇన్నీ కాదు. రేవంత్ రెడ్డికి ఏ అలవాట్లు లేవు. రాష్ట్రానికి నిధులు, వరదల వల్ల కలిగిన నష్టంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు. సీఎం హోదాలో కేంద్ర నిధుల కోసం ఎన్నిసార్లు అయిన ఢిల్లీకి పోతాడు. పోతే కేటీఆర్ నీకు ఏం నొప్పి. నీ చెల్లి కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో బీజేపీ ముందు మోకరిల్లినవ్..? ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ జీతం తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు’ అని బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.