Telangana

ఆర్టీసీని అమ్మితే వెయ్యి కోట్ల బహుమతి ఇస్తారా?

కేంద్రం తెస్తున్న విద్యుత్ సంస్కరణలు అందరికీ తెలియాలన్నారు కేసీఆర్. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తలచుకుంటే భయమేస్తోందన్నారు. అభివృద్ధికి కొలమానంలో విద్యుత్ వినియోగం కూడా ఒకటన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ భేటీలోనే తెలంగాణ మండలాలను లాక్కున్నారంటూ దుయ్యబట్టారు కేసీఆర్. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. కేంద్ర ఇచ్చిన గెజిట్‌లో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఉందని తెలిపారు కేసీఆర్. ఆర్టీసీని అమ్మాలని కేంద్రం లేఖలు రాస్తోందన్నారు. ఆర్టీసీని అమ్మితే వెయ్యి కోట్ల బహుమతి ఇస్తామంటున్నారన్నారు కేసీఆర్. కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం చేస్తోందన్నారు.