గుర్తుపట్టలేనంతగా మారిన ‘మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ ‘చూస్తే అవాక్కవుతారు
‘మనసంతా నువ్వే’ సినిమా మీ అందరికీ గుర్తు ఉందిగా. ఉదయ్ కిరణ్ సరసన రీమా సేన్ యాక్ట్ చేసింది. మొదటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. అందమైన లవ్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం యూత్ ను బాగా అలరించింది . ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ‘తూనీగ తూనీగ’ సాంగ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో రీమా సేన్ చిన్ననాటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఓ చిన్నారి. తన పేరే సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, బెంగాళీ భాషలలో పలు మూవీస్ లో కూడా నటించింది. ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాల్లో నటించింది కానీ, అంతగా గుర్తింపు రాలేదు . దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఉన్నత చదువులు పూర్తి చేసిన సుహాని ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది సుహాని. సినిమాకు దూరమైన సోషల్ మీడియా లో ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది . చూసిన ప్రతి ఒకరు తూనీగ తూనీగ పాపా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

