Home Page SliderTelangana

మావైపు కన్నెత్తి చూస్తే అడ్డంగా నరుకుతా..

వివాదస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఫైర్ బ్రాండ్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టెర్రలిస్టులకు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన వైపు గానీ, తన కుటుంబం వైపు గానీ కన్నెత్తి చూస్తే అడ్డంగా నరుకుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ బైక్ పై తిరగొద్దని పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆయన మాత్రం సెక్యూరిటీ లేకుండా గోషామహల్ లో బైక్ పైనే తిరుగుతున్నారు. ఈ విషయమై తాజాగా రాజాసింగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను, నా పక్కన బైకు నడుపుతున్న నా కొడుకు… పోలీసులు ఎన్ని నోటీసులిచ్చినా బైక్ పైనే తిరుగుతాము’ అని అన్నారు.