తామర గింజలలో ఏముందో తెలిస్తే వదలరు..
ఫూల్ మఖానా లేదా తామర గింజలు మనందరికీ తెలుసు. దీనిలో ఉండే పోషకాల విలువ తెలిస్తే తినకుండా వదలరు. తెల్లగా పత్తి గింజలా కనిపించే ఈ ఫూల్ మఖానా సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది.
దీనిలో మైక్రో న్యూట్రియెంట్స్ ఉంటాయి. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దీనిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచి, టైప్ 2 మధుమేహాన్ని నియంత్రణ చేస్తుంది.

దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. దీనిలో ఉండే ఫైబర్ తినడం వల్ల ఆకలి మందగిస్తుంది. దీనిలో మంచి బాక్టీరియా వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, ఈ ఫూల్ మఖానా తినడం వల్ల వయస్సు కంటే తక్కువగా కనిపిస్తారు. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండడమే దీనికి కారణం. శరీరంపై ముడుతలను, చర్మంపై మొటిమలను తగ్గిస్తాయి.
దీనిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు పిల్లలకు ఇది మంచి పోషకాహారం. ఇది రోజులో 30 గ్రాములు తింటే చాలా మంచిది. దీనిలో ఫ్యాట్ శాతం అసలు ఉండదు. అందువల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.
దీనివల్ల మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఒత్తిడి, భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. హార్మోన్లను బాలెన్స్ చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలో రక్తాన్ని శుద్ధి చేసే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్లు ఉంటాయి. దీనితో రక్తశుద్ధి జరుగుతుంది. శరీరంలో మలినాలను త్వరగా బయటకు పంపుతుంది. కిడ్నీల వాపు, నొప్పి తగ్గించడంలో దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

