Andhra PradeshHome Page Slider

పంచాయతీ కార్యదర్శి ఆస్తి ఎంత తెలిస్తే మైండ్ బ్లాక్..

ఏపీ లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ ఈవోగా పని చేసిన మహేశ్వరయ్య ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే షాక్ కు గురయ్యారు. గత ఫిబ్రవరిలో అతడు రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తాజాగా తిరుపతి పేరూరులోని మహేశ్వరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.