Breaking NewsHome Page SliderLifestyleNational

ఈ ఆరు గుణాలుంటే మీరు….ప్ర‌పంచ సుంద‌రే

అందాల భాగ్య నగరం…. ప్ర‌పంచ అందాల పోటీలకు సిద్ధమవుతోంది. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమంతోపాటు 31న ఫైనల్స్ జరుగ‌నున్నాయి. పోటీదారులు 4 బృందాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు. ఈ పోటీలలో విజేత జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు గవర్నర్, సీఎంలను మర్యాదపూర్వకంగా కలుస్తారు. 120 దేశాలకు చెందిన అందాల భామ‌లు ఈ పోటీలలో పాల్గొననున్నారు.అందాల పోటీలంటే కేవలం బాహ్య సౌంద‌ర్య‌మ‌నే భావ‌న చాలా మందిలో ఉంటుంది.ఈ అందాల పోటీల్లో మొత్తం 6 ర‌కాల గుణాల‌ను జ‌డ్జీలు ప‌రిశీలిస్తారు.ఇందులో మేథ‌స్సు,బాహ్య‌ సౌంద‌ర్యం,అంతః సౌంద‌ర్యం,చురుకుత‌నం,స‌మ‌య‌స్పూర్తి, సేవా గుణం ఈ ఆరు గుణాల మేలి క‌లయికే ….మ‌గువ మేని క‌ల‌యిక‌గా లెక్కించి ప్ర‌పంచ సౌంద‌ర్య‌త‌ను ప్ర‌క‌టిస్తారు.