భిక్షాటన చేసే వారికి డబ్బులిస్తే కేసులే..
యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్ ఇండోర్ నగరం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు.. యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భిక్షాటన చేసే వారికి డబ్బులిచ్చేవారిపైనా ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తామని ప్రకటించారు. జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు. యాచకులులేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు ఇండోర్ కలెక్టర్ ఆశిక్ సింగ్. భిక్షాటన చేస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన ఆదేశించారు.