హంగ్ వస్తే: BRS, కాంగ్రెస్ కలిసే ప్రభుత్వ ఏర్పాటు..
తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తే.. BRS, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గతంలో కలిసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, BRSలకు ఉందన్నారు. BRS, BJP ఒక్కటే అయితే తాను గజ్వేల్ నుండి ఎందుకు పోటీలో నిలబడతానని, BRSతో BJP కి ఎప్పుడూ పొత్తు లేదని స్పష్టం చేశారు. BJP పై విషప్రచారం మానుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు.

