Breaking NewsHome Page SliderPoliticsSports

దేశంలోకి అడుగుపెడితే…ఇక ఖ‌తం

బెట్టింగ్​ యాప్స్​ను ప్రమోట్​ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్​పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో భయ్యా సన్నీ యాదవ్​ దేశంలోకి ఎప్పుడు అడుగుపెట్టినా అరెస్టు చేస్తామని సూర్యాపేట పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ పలువురు యుట్యూబర్లు, సినీ తారలు బెట్టింగ్ యాప్స్​పై ప్రచారం చేస్తున్న కారణంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు బెట్టింగ్ యాప్స్​ను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టారు.సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ గత కొన్నేళ్లుగా బైక్ రైడ్ చేస్తూ ప్రపంచాన్ని చుట్టి వస్తున్నారు. ప్రముఖ యూట్యూబర్​గా గుర్తింపు పొందిన సన్నీ యాదవ్​కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే సన్నీ యాదవ్​ బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్ చేయగా, అతడు చెప్పినట్లుగా చేసి తాము ఆర్థికంగా నష్టపోయామని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.