హోలీ రోజు ఈ పనులు చేస్తే చర్యలు తప్పవు..
రంగుల పండుగ హోలీ అంటే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకూ అందరికీ సందడే. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకునే ఈ పండుగ నేడు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే కొందరు అత్యుత్సాహవంతుల కారణంగా కొన్ని అపశృతులు, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి హైదరాబాద్ పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. రంగులు చల్లుకునేటప్పుడు పబ్లిక్ ప్లేస్‌లలో ఇతరుల అనుమతులు లేకుండా వారిపై రంగులు వేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అపరిచితులపై కూడా రంగులు వేయవద్దని సూచించారు. నేటి ఉదయం నుండి రేపు ఉదయం వరకూ ఈ నిబంధన ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే నగరంలో మద్యం అమ్మకాలు కూడా ఈ రోజు నిలిపివేశారు.


 
							 
							